
వెబ్‌డెస్క్, బిజినెస్: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.322 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.295 దిగివచ్చింది. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు పసిడి ధరలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
నవంబర్ 5న గరిష్ఠ స్థాయులకు చేరిన బంగారం ధరలు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా నమోదైన భారీ పతనంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది.
వరుసగా పెరుగుతున్న పసిడి ధరలతో ఆందోళన చెందుతున్న వినియోగదారులకు తాజా తగ్గుదల కొంత ఉపశమనం కలిగిస్తోంది.




