హైదరాబాద్‌కు చెందిన ఓ తెలుగు మహిళ ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో సిడెన్‌హామ్ నియోజకవర్గం నుంచి ‘ది రిపబ్లికన్’ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్నారు.

ప్రజా భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల, విద్య, వైద్య రంగాల అభివృద్ధిని ప్రధాన ఎన్నికల హామీలుగా ఆమె ప్రకటించారు. సిడెన్‌హామ్ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. బ్యాలెట్ పేపర్‌లో లక్ష్మి పేరు మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌కు చెందిన తెలుగు మహిళ ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన హైదరాబాద్‌కు చెందిన తెలుగు మహిళ లక్ష్మి లంకల కేందర్ల విక్టోరియా రాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో సిడెన్‌హామ్ నియోజకవర్గం నుంచి ‘ది రిపబ్లికన్’ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. బ్యాలెట్ పేపర్‌లో లక్ష్మికి మూడో స్థానం కేటాయించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని విక్టోరియా ఎన్నికల సంఘం కూడా అధికారికంగా నమోదు చేసింది.

నారాయణగూడ నుంచి ఆస్ట్రేలియా రాజకీయాల వరకు..

లక్ష్మి హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న కేశవ మెమోరియల్ స్కూల్ అండ్ కాలేజీలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలో ఎంబీబీఎస్ చదివారు. కర్ణాటకకు చెందిన మల్లేశ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆమె తల్లి ఎల్‌కే జయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివసిస్తున్నారు.

వైద్య విద్యను అభ్యసించి ఆస్ట్రేలియాలో స్థిరపడిన లక్ష్మి ఇప్పుడు అక్కడి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం విశేషంగా మారింది. విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తెలుగు ప్రజలతో పాటు ఆస్ట్రేలియాలోని భారతీయ ప్రవాసుల్లోనూ ఆసక్తి నెలకొంది

ఎన్నికల ప్రచారంలో లక్ష్మి ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రజా భద్రత, రవాణా, విద్య, వైద్య రంగాల అభివృద్ధిని తన ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా చేర్చారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం తన లక్ష్యమని ప్రకటించారు.

రవాణా రంగంలో మెరుగైన రహదారులు, ప్రమాదాల నివారణకు సురక్షిత కూడళ్లు, నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ, మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తానని హామీ ఇచ్చారు. విద్యారంగంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు అవసరమైన వనరులను అందుబాటులోకి తీసుకొస్తానని పేర్కొన్నారు. వైద్య రంగంలో ఆసుపత్రులు, జనరల్ ప్రాక్టీషనర్లు, అత్యవసర వైద్య సేవలు ప్రజలకు సులభంగా అందేలా కృషి చేస్తానని తన ఎన్నికల ప్రచారంలో వివరించారు.

సిడెన్‌హామ్ ప్రజలకు లక్ష్మి ప్రత్యేక సందేశం

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి లక్ష్మి తన సందేశాన్ని వెల్లడించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారి తరఫున గళం వినిపిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ‘మీ సమస్యలను వినడానికి, మన సమాజం తరఫున గళం వినిపించడానికి, సిడెన్‌హామ్‌కు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడిన లక్ష్మి.. ఇప్పుడు అక్కడి రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తుండటం తెలుగు ప్రవాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో ఆమెకు ఎలాంటి ప్రజా మద్దతు లభిస్తుందో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *