ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 201 మండలాల పరిధిలో ఉన్న 3,240 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విడతలో మొత్తం 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఏకగ్రీవమైన స్థానాలు మినహా 3,189 సర్పంచ్ స్థానాలకు, 25,101 వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 62,863 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *