కర్నూలు బ్యూరో: కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

జిల్లాలో మొత్తం ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదోని డివిజన్‌లో ఆదోని-1, ఆదోని-2, హొళగుంద మండలాలు, పత్తికొండ డివిజన్‌లో ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ ఎనిమిది మండలాల పరిధిలో 135 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 1,005 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *