
జరుపుకుంటారు. ఈ రోజు సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? గమనించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నితిన్ కుమార్. ఎన్ పూర్తి వివరాలు అందించారు.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా అందనప్పుడు ఇది సంభవిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల గానీ, లేదా మెదడులో రక్తనాళం పగిలిపోవడం వల్ల గానీ స్ట్రోక్ వస్తుంది. వైద్యులు దీనిని సెరబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్ (CVA) లేదా “బ్రెయిన్ అటాక్” అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో స్ట్రోక్ రెండో స్థానంలో ఉంది. మీ చుట్టుపక్కల ఎవరికైనా వెంటనే అత్యవసర వైద్య సాయం అందించాలి.
కంటి చూపు సరిగ్గా లేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, తలతిరగడం, గందరగోళం లేదా శరీర సమతుల్యత (బ్యాలెన్స్) కోల్పోవడం. ఈ లక్షణాలు కాసేపట్లో తగ్గిపోయినా సరే నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం, బీపీని అదుపులో ఉంచుకోవడం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మెదడుకు తగినంత రక్తప్రసరణ జరగనంత సేపు స్ట్రోక్ ప్రభావం కొనసాగుతుంది. రక్త ప్రసరణ లేక ఆక్సిజన్ అందకపోతే మెదడు కణాలు చనిపోతాయి. ఎక్కువ సంఖ్యలో మెదడు కణాలు నశిస్తే, ఆ నష్టం శాశ్వతంగా మారిపోతుంది. దీనివల్ల శరీర భాగాలు సరిగ్గా పనిచేయకపోవడం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించవచ్చు.
రక్తప్రసరణను త్వరగా పునరుద్ధరించడం వల్ల శాశ్వత నష్టాన్ని నివారించవచ్చు లేదా దాని తీవ్రతను తగ్గించవచ్చు. అందుకే చికిత్సలో సమయం చాలా ముఖ్యం. చికిత్స పొందిన తర్వాత కూడా దాని లక్షణాలు ప్రభావాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది.

