కేసుల్లో సీఎం రేవంత్‌ టాప్‌..

Date:

దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్‌ 3 స్థానాలను దక్కించుకున్నారు. ఇక.. కేసుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఆయనపై ఏకంగా 89 కేసులున్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 31 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన నివేదికను ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌) సోమవారం విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం 31 మంది సీఎంల ఆస్తుల మొత్తం విలువ రూ.3,660 కోట్లు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ రూ.1413 కోట్ల ఆస్తులతో సంపన్న సీఎంల జాబితాలో అగ్రస్థానంలో నిలవగా రూ.931 కోట్ల ఆస్తులతో ఏపీ సీఎం చంద్రబాబు రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం విజయ్‌ రూ.648 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో 8వ స్థానంలో నిలిచారు.

అతి తక్కువ ఆస్తులున్న వారిలో జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రూ.55 లక్షలతో మొదటిస్థానంలో, బెంగాల్‌ సీఎం సువేందు అధికారి రూ.85 లక్షలతో రెండో స్థానంలో, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ రూ.కోటితో మూడో స్థానంలో ఉన్నారు. ఆస్తుల సంగతి పక్కన పెడితే.. మొత్తం 14 మంది సీఎంలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇద్దరు సీఎంలపై హత్యాయత్నం కేసులున్నాయి. రేవంత్‌ తర్వాత అత్యధికంగా బెంగాల్‌ సీఎం సువేందు అధికారిపై 29 కేసులున్నాయి. 19 కేసులతో ఈ జాబితాలో డీకే శివకుమార్‌ మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. 31 మంది సీఎంలలో 17 మంది 51-60 ఏళ్ల మధ్య వయసులో ఉండగా, 8 మంది 41-50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...