17 నుంచి విశాఖలో విమాన సేవలు బంద్‌

Date:

విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్‌ విడుదల చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం ప్రారంభమయ్యే ఈ విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. దీంతో విశాఖపట్నంలో పౌర విమానాశ్రయాన్ని ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్టు గెజిట్‌లో కేంద్రం ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదన చేసినప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై ఒప్పందం జరిగింది.

దాని ప్రకారం భోగాపురంలో ఆపరేషన్లు ప్రారంభమైన నాటినుంచి 30 ఏళ్ల పాటు విశాఖ విమానాశ్రయం (ఐఎన్‌ఎస్‌ డేగ) నుంచి పౌర విమానాలు నడపకూడదు. దానిని ఇప్పుడు అమలు చేయనున్నట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విశాఖకు కేటాయించిన ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు కోడ్‌ ‘వీటీజెడ్‌ను అల్లూరి విమానాశ్రయానికి బదలాయిస్తున్నట్లు తెలిపింది.

విశాఖపట్నం విమానాశ్రయం నేవీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఒకవైపు నేవీ, మరోవైపు పౌర విమాన శాఖ దానిని ఉపయోగించుకుంటున్నాయి. పౌర విమాన సర్వీసులు ఆగస్టు 17 నుంచి నిలిపివేసినా, నాన్‌ షెడ్యూల్డ్‌ విమాన సేవలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలకు చెందిన చార్టర్డ్‌ విమానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యులు వచ్చినప్పుడు వారి విమానాలు, హెలికాప్టర్లు దిగడానికి, ఇక్కడినుంచి బయలుదేరడానికి ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...