
అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా “క్యాప్ 278 సైనింగ్ ఆఫ్” అంటూ ఒక భావోద్వేగ వీడియో నోట్‌ను షేర్ చేస్తూ ఈ నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఎప్పుడూ దేశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చానని, భారత్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. బిసీసీఐ, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, దేశ వ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ రహానే ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
భారత క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియాలో “క్యాప్ 278 సైనింగ్ ఆఫ్” అనే క్యాప్షన్‌తో భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ తన కెరీర్‌కు ముగింపు పలికినట్లు వెల్లడించాడు. “జీవితంలో ప్రతిదానికీ ఒక ఆరంభం, ముగింపు ఉంటాయి. నా బ్యాటింగ్‌లో సరైన టైమింగ్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఆట నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే సరైన సమయమని భావిస్తున్నాను” అంటూ రహానే ఎమోషనల్ అయ్యాడు.
2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రహానే, టీమిండియా సాధించిన అనేక చారిత్రక విజయాల్లో భాగమయ్యాడు. దేశం తరఫున అన్ని ఫార్మాట్లలో కలిసి 195 మ్యాచ్‌లు ఆడిన రహానే, ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో అత్యంత కీలకమైన ప్లేయర్‌గా ఎదిగాడు. కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రహానే, టెస్టుల్లో 5,000 పైచిలుకు పరుగులు చేసి భారత జట్టుకు ఎన్నో క్లిష్ట సమయాల్లో అండగా నిలిచాడు. రహానే మొత్తం 5077 పరుగులు (సగటు 38.46) సాధించారు. టెస్టుల్లో 12, వన్డేల్లో మూడు శతకాలు సాధించాడు. విదేశీ గడ్డపై నమ్మదగిన మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా రాణించిన రహానే, తన 12 టెస్ట్ సెంచరీలలో ఎనిమిదింటిని విదేశాల్లోనే సాధించాడు. 2023లో భారత్ తరఫున చివరిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

