సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : టీటీడీ అదనపు ఈవో

Date:

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు

సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామని వివరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్‌ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని కోరారు.  విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుపతి జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాల తో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళా బృందాలు వచ్చేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. ఈ సమీక్షలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...