హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు, కేవలం ఫిజికల్ టెస్ట్‌లే.. 2 రోజులే ఛాన్స్!

Date:

నిరుద్యోగులకు హైడ్రా భారీ శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 100 డీఆర్ఎస్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి అర్హత కలిగిన వారికి గరిష్ఠంగా 35 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఫిజికల్ టెస్ట్‌ల ఆధారంగానే ఈ హైడ్రా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ ధ్యేయంగా పనిచేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి మొత్తం 150 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. శారీరక దారుఢ్యం, క్రీడా ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అత్యుత్తమ అవకాశంగా నిలవనుందని హైడ్రా వర్గాలు వెల్లడించాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం 150 పోస్టుల్లో 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 35 ఏళ్లు మించకూడదని రూల్ పెట్టారు. డ్రైవర్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు విధిగా ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఈ హైడ్రా ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష ఉండదని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...