ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. డిగ్రీ, ఫార్మసీ, న్యాయ విద్యకు ఫీజులు పెరిగాయి.. పూర్తి వివరాలివే

Date:

ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్య కనీస ఫీజులను నిర్ణయించింది. డిగ్రీలో. బీఎస్సీకి రూ.17,500, బీకాం రూ.14వేలు, బీఏ రూ.13 వేలు, బీ ఒకేషనల్‌ రూ.17,500గా నిర్ణయించారు. బీహెచ్‌ఎంకు రూ.35 వేలు, బీబీఏ/బీబీఎం రూ.21 వేలు, బీసీఏ రూ.21 వేలు, కనీస ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ కోర్సుల్లో ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు) రూ.16 వేలు, ఎల్‌ఎల్‌బీ (ఐదేళ్లు) రూ.15 వేలు, ఎంఎల్‌/ఎల్‌ఎల్‌ఎం రూ.22 వేలు. ఫార్మా కోర్సుల్లో బీ-ఫార్మసీ రూ.45 వేలు, ఫార్మా-డీ రూ.45 వేలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, ఫార్మసీ, న్యాయ విద్యకు సంబంధించి తాత్కాలిక ఫీజులను ఖరారు చేసింది. ఈ ఏడాది గతేడాది ఫీజుల కంటే 17.5% పెంచింది. వాస్తవానికి ప్రతి మూడేళ్లకోసారి వృత్తి విద్యా కోర్సులకు ఫీజులు నిర్ణయిస్తారు.. గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు 2025-26 విద్యా సంవత్సరంతో ముగియడంతో ఈ ఏడాది ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. కానీ కొత్త ఫీజుల్ని నిర్ణయించడంలో ఆలస్యం కావడంతో.. ప్రస్తుతం తాత్కాలికంగా ఫీజుల్ని ఖరారు చేశారు. ఫైనల్‌గా ఫీజుల నిర్ణయం వచ్చే వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

డిగ్రీ కోర్సులు.. బీహెచ్‌ఎం, బీహెచ్‌ఎంసీటీకి రూ.35వేలు.. బీబీఏ, బీబీఎం-రూ.21 వేలు.. బీసీఏ- రూ.21వేలు.. బీఎస్సీకి రూ.17,500.. బీ.వొకేషనల్‌- రూ.17,500.. బీకామ్-రూ.14వేలు.. బీఏ-రూ.13 వేలు ఫీజును ఖరారు చేశారు. బీఫార్మసీకి రూ.45 వేలు.. ఫార్మాడీ-రూ.45 వేలు.. ఎల్‌ఎల్‌బీ మూడేళ్లకు రూ.16 వేలు.. ఐదేళ్ల కోర్సుకు రూ.15వేలు.. ఎంఎల్, ఎల్‌ఎల్‌ఎంకు రూ.22 వేలు చొప్పున ఫీజులు నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాదు ఇటీవల ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.. ఈ తాత్కాలిక ఫీజులతో కౌన్సెలింగ్‌ పూర్తి చేశారు. కానీ తుది ఫీజులను ఈ అడ్మిషన్లకు అమలు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఈ నెల 5 నుంచి విద్యార్థుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కామన్‌ అడ్మిషన్స్‌ పోర్టల్‌లో ఈ నెల 11 వరకు విద్యార్థులు రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. అనంతరం ఈ నెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలిస్తారు.. ఈ నెల 15 నుంచి 19 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 20న ఆప్షన్ల మార్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 26న సీట్లు కేటాయిస్తారు.. 27 నుంచి తరగతులు ప్రారంబిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యార్థులు తమ అడ్మిషన్లను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆన్‌లైన్‌లో, కాలేజీ లాగిన్‌ ద్వారా విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు ఆప్షన్లు కాలేజీ లాగిన్‌ ద్వారా పెట్టుకుంటే అదే మొదటి ప్రాధాన్యగా ఉంటుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...