ఢిల్లీ సీఎం తీసుకున్న నిర్ణయం అద్భుతం.. ఏపీలోనూ అమలు చేస్తే బావుంటుంది: విజయసాయిరెడ్డి

Date:

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సేవల హక్కు బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు చాలా బావుందుని.. ఏపీలో కూడా అమలు చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఏపీలో సీఎస్‌ఆర్ నిధుల ఖర్చుకు సంబంధించిన అంశంపై కూడా విజయసాయిరెడ్డి తన అభిప్రాయాలను చెప్పారు.

రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఆయా అంశాలపై తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు, వివిధ అంశాలను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే బావుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఢిల్లీ సిటిజెన్ టు టైమ్ బౌండ్ అండ్ ఈజ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ బిల్లు 2026ను ఇటీవల ఆమోదించారు. ఈ బిల్లును ఏపీలో కూడా అమలు చేస్తే బావుంటుందన్నారు.

ప్రతి దరఖాస్తును పర్యవేక్షిస్తూ, నిర్దిష్ట కాలవ్యవధిలోగా ప్రభుత్వ సేవలను పొందేందుకు పౌరులకు చట్టపరమైన హక్కును కల్పించేందుకు.. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సేవల హక్కు బిల్లును అభినందిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనది.. ఈ బిల్లు దిశగా కృషి చేయాలన్నారు.. ఇది పౌర కేంద్రీకృత పాలన. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయడానికి పరిగిణలోకి తీసుకోవాలి’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై విజయసాయిరెడ్డి స్పందించారు. ‘2024-25 ఆర్థిక సంవత్సరంలో CSR (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) పై ఖర్చు చేసిన రూ.40,794 కోట్లలో.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.1,383 కోట్లు (3.3శాతం) మాత్రమే ఎందుకు అందాయి?. ఏపీ ప్రభుత్వం కంపెనీలకు అతి తక్కువ ధరలకు ఎకరాల కొద్ది భూమి కేటాయించింది.. ఈ భూముల ద్వారా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆ కంపెనీలు కూడా మరింత CSR నిధులు కేటాయించకూడదా?’ అంటూ ప్రశ్నించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...