విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. పేరు ఇదేనా?, మూడు పదాలతో!

Date:

మాజీ ఎంపీ పొలిటికల్ రీ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడతారా?.. మళ్లీ పాత గూటికి చేరతారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని.. ఆ పార్టీకి పెట్టిన పేరు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై మాజీ ఎంపీ స్పందించాల్సి ఉంది.

రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటి. కొత్త పార్టీ పెడతారా?, వైఎస్సార్‌‌సీపీలో మళ్లీ చేరతారా? అనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పెడతానని గతంలో ప్రకటించగా.. కొద్దిరోజులుగా ఆయన మళ్లీ వైఎస్సార్‌‌సీపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారని.. ఆయన పార్టీ పేరుతో సహా వైరల్ చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి త్వరలో పెట్టబోయే పార్టీ పేరుపై చర్చ జరుగుతోంది. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పేరు ‘ భారత్ జన వికాస్ ‘ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు ‘భారత్ జన వికాస్’ పేరు పెట్టినట్లుగా చెబుతున్నాయి. ఆయన మాత్రం ఇప్పటి వరకు కొత్త పార్టీ పేరుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ‘భారత్ జన వికాస్’ పేరుతో పార్టీ పెడితే అది ఏపీకి మాత్రమే పరిమితం చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఈ ప్రచారంపై విజయసాయిరెడ్డి స్పందించాల్సి ఉంది.

గతవారం విజయసాయిరెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.. త్వరలోనే ప్రకటన ఉంటుందని జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి ఈ ప్రచారంపై స్పందించారు. ‘నా రాజకీయ పునరాగమనం, భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ, వ్యూహాలను త్వరలో మీడియా మిత్రులతో జరిగే నా ప్రెస్‌మీట్‌లో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర మనస్తత్వం.. ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగకుండా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుని, ఆత్మగౌరవంతో నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటాను’ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన ట్వీట్‌ను బట్టి ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. మరి విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి మొగ్గు చూపుతారా?.. మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారా అన్నది చూడాలి. అంతేకాదు విజయసాయిరెడ్డి గతంలో తాను ఓ మీడియా సంస్థలను కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. మరి ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డికి వైఎస్సార్‌సీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా రెండుసార్లు అవకాశం దక్కింది.. ఆయన అనూహ్య పరిణామాల మధ్య ఆ పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు.. మళ్లీ కొంతకాలం తర్వాత సొంత పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...