తపాలాశాఖ గోల్డెన్ ఛాన్స్.. మీరు లేఖలు రాయగలరా, అయితే రూ. 25 వేలు మీకే!

Date:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తపాలా శాఖ ధాయ్ అఖర్ పేరుతో లేఖల పోటీలు నిర్వహిస్తోంది. భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం అనే అంశంపై ఒక లేఖ రాయాల్సి ఉంటుంది. అలా మనం రాసిన లేఖలను ప్రతి జిల్లా పరిధిలో మూడు చొప్పున ఎంపిక చేస్తారు. వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. అక్కడ ప్రథమ బహుమతి వచ్చిన లేఖకు రూ. 25 వేలు, ద్వితీయ బహుమతికి రూ. 10 వేలు, తృతీయ బహుమతికి రూ. 5 వేలు చొప్పున అందజేయనున్నారు.

మనం లేఖలు రాసి ఎన్నేళ్లయిందో కదా.. 90లో పుట్టిన వారికి ఈ లేఖలు రాసిన జ్ఞాపకాలు ఉండొచ్చు కానీ, ఇప్పుడున్న జనరేషన్‌కి కనీసం అదేంటో కూడా తెలిసే అవకాశం లేదు. మనం మరచిపోయిన వాటిని గుర్తు చేసేందుకు తపాలాశాఖ ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. మీకు లేఖలు రాయడంలో అనుభవం ఉందా.. అయితే, ఈ రూ. 25 వేలు మీకే.. ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రైజ్‌మనీ ఎలా గెలుచుకోవాలో తెలుసుకుందాం పదండీ!

తపాలా శాఖ ధాయ్ అఖర్ పేరుతో లేఖల పోటీలు నిర్వహిస్తోంది. ‘భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం’ అంశంపై ఒక లేఖ రాయాల్సి ఉంటుంది. అలా మనం రాసిన లేఖలను ప్రతి జిల్లా పరిధిలో మూడు చొప్పున ఎంపిక చేస్తారు. వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. అక్కడ ప్రథమ బహుమతి వచ్చిన లేఖకు రూ. 25 వేలు, ద్వితీయ బహుమతికి రూ. 10 వేలు, తృతీయ బహుమతికి రూ. 5 వేలు చొప్పున అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన మూడు లేఖలను జాతీయ స్థాయికి పంపిస్తారు.

ప్రతి రాష్ట్రానికి సంబంధించి మొదటి మూడు బహుమతులు వచ్చిన లేఖలను జాతీయ స్థాయికి పంపిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన లేఖలను పరిశీలించి వాటిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన లేఖలకు బహుమతులు వరుసగా రూ. 50 వేలు, రూ. 25 వేలు, రూ. 10 వేల చొప్పున ఇస్తారు. పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపాలాశాఖ కోరింది.

‘భూమాతకు ఒక లేఖ.. ఈ ప్రకృతిని రక్షిస్తానని నా వాగ్దానం’ అంశంపై లేఖను ఏ వయస్సు వారైనా రాయొచ్చు. అయితే 18 ఏళ్లలోపు విద్యార్థులు, ఆపై వయస్సు వారిని రెండు విభాగాలుగా విభజిస్తారు. మనం ఈ లేఖను ఇన్‌లాండ్ లెటర్‌పై 500 పదాలకు మించకుండా రాయాలి. ఏ4 సైజు పేపరైతే 1000 పదాలకు మించకుండా లేఖ రాయాలి. తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. కవర్‌పై ఎంట్రీ ఫర్ ధాయ్ అఖర్ 2025-26 అని రాయాలి. ఆ లేఖలను అక్టోబర్ 31లోగా జిల్లా కేంద్రంలోని తపాలాశాఖ సూపరింటెండెంట్ చిరునామాకు పంపాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...