బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతల వికృత చేష్టలు: మంత్రి కొల్లు రవీంద్ర

Date:

బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసన దీక్షలు బైక్ ర్యాలీలపై ఆయన స్పందించారు.

వైసీపీ నిర్వహించిన ర్యాలీల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు పాల్గొన్నాయని మంత్రి ఆరోపించారు. ఆ నిరసన కార్యక్రమాల్లో రైతులు విద్యార్థులు ఎక్కడా కనిపించలేదన్నారు. యువతను నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు.

మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించడం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క మెగా డీఎస్సీ అయినా నిర్వహించారా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.

వైసీపీ పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కరువైందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని తెలిపారు. ప్రతినెలా పెన్షన్లు అందిస్తున్నామని తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...