గామ‌న్ బ్రిడ్జి స‌మీపంలో యువ‌తి మృతదేహం.. తీవ్ర గాయాల‌తో యువ‌కుడు.. ఏం జ‌రిగింది..?

Date:

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి న‌గ‌ర‌ శివారులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి న‌గ‌ర‌ శివారులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు యువ‌తి మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.

తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువ‌కుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, యువతిని శాంతినగర్‌ నివాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యాయత్నమా అనే కోణంతో పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు.

ఘ‌ట‌న‌పై ఇప్పటికే ఇరు కుటుంబాల‌ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...