
వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా పొల్యూషన్ చెకప్ చేయించుకొని పీయూసీసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్) పొందాలి. ఈ మేరకు వ్యక్తిగత, రవాణా వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని పరిశీలించి పీయూసీసీ తీసుకోవాలి. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ప్రజలకు ముఖ్యమైన గమనిక.. వాహన కాలుష్య నియంత్రణ కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వ్యక్తిగత, రవాణా వాహనాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుని పీయూసీసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్) సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇకపై వాహనాలు నిబంధను పాటించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. బీఎస్ 1 నుంచి బీఎస్ 4 వాహనాలకు సంబంధించిన పీయూసీసీ.. బీఎస్ 1, 2, 3, 4 వాహనాలకు ప్రస్తుతం ఆరు నెలలకోసారి తీసుకునేవారు. తాజా నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి పొల్యూషన్ టెస్ట్ చేయించి సర్టిఫికెట్ తీసుకోవాలి. బీఎస్-4 వాహనాలకు మాత్రం ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం ఆరు నెలకోసారి పీయూసీసీ తీసుకోవాలి.
బీఎస్ 6 బైక్లు, కార్లకు ప్రస్తుతం ఏడాదికోసారి పీయూసీసీ తీసుకోవాలి.. ఇకపై మూడేళ్లకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసినవారు ఆరేళ్లలో రెండుసార్లు పీయూసీసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు ఏడాదికోసారి టెస్టింగ్ చేయించాలి.. పదేళ్ల తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లారీలు బస్సులకు సంబధించి కొత్త వాహణాలకు మొదటి రెండేళ్ల పీయూసీసీ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది టెస్టింగ్ చేయించేవారు. కొత్త నిబంధనల ప్రకారం కొత్త వాహనాలకు ఆరేళ్ల వరకు ప్రతి రెండేళ్లకోసారి పీయూసీసీ తీసుకోవాలి. ఆ తర్వాత 6 నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి.. పదేళ్లు దాటితే ఆరు నెలలకోసారి సర్టిఫికెట్ తీసుకోవాలి.
2000లో భారత్ స్టేజ్ (బీఎస్) ప్రమాణాలను తీసుకొచ్చారు. 2000లో తయారైన వాహనాలను బీఎస్-1 వాహనాలు.. 2001-05 మధ్య తయారైనవి బీఎస్-2 వాహనాలు.. 2005 నుంచి బీఎస్-3 వాహనాలు మాత్రమే విక్రయించేలా నిబంధనలు వచ్చాయి. 2010 నుంచి బీఎస్-3 వాహనాలు తీసుకొచ్చారు.. దేశంలోని 13 నగరాల్లో బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించేలా చూశారు. 2017 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-4 వాహనాలు రాగా.. బీఎస్-5 వాహనాలు రాలేదు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 వాహనాలు రాగా.. ప్రస్తుతం వచ్చే వాహనాలన్నీ బీఎస్-6 కిందకు వస్తాయి.

