విజయవాడ నుంచి వారణాసి 2 గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్ ప్రారంభం, టికెట్ ధర సహా పూర్తి వివరాలివే!

Date:

ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్‌కతా నగరాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసులను ప్రారంభించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ విమానాలను వారానికి మూడు రోజుల పాటు నడపనుంది.

ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ముఖ్యంగా విజయవాడ నుంచి వారణాసికి నేరుగా కేవలం రెండు గంటల్లో చేరుకునే సౌకర్యం ప్రయాణికులకు కల్పించారు.

ఫ్లైట్ నంబర్ 6E 6502 విజయవాడ నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అనంతరం వారణాసి నుంచి బయల్దేరి రాత్రి 10.15 గంటలకు కోల్‌కతా చేరుతుంది. మరోవైపు 6E 6501 కోల్‌కతా నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరి 3.55 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

విజయవాడ–వారణాసి విమాన టికెట్ ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్య ఉంటుందని ఇండిగో తెలిపింది. ఈ సర్వీసుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే విజయవాడ నుంచి వారణాసికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ఉన్నప్పటికీ, ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఇండిగో నేరుగా రెండు గంటల్లో వారణాసి చేరుకునే సర్వీసును ప్రారంభించడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా వారణాసికి వెళ్లే భక్తులకు ఈ కొత్త విమాన సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...