గుంటూరు: పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళం

Date:

గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఆధునికీకరణకు మరో కీలక ముందడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ రూ.20 కోట్లను వెచ్చించేందుకు ముందుకొచ్చారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో చల్లా రాజేంద్రప్రసాద్, పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ మధ్య ఈ మేరకు ఎంవోయూ కుదిరింది. కొత్త భవనాన్ని సెల్లార్ + G+2 అంతస్తులుగా నిర్మించనున్నారు.

త్వరలో శంకుస్థాపన

గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి, చల్లా రాజేంద్రప్రసాద్, అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి.. ఆధునిక సౌకర్యాలతో కొత్త గ్రంథాలయాన్ని నిర్మించనున్నారు.

త్వరలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రంథాలయ నిర్మాణానికి రూ.20 కోట్లు అందించేందుకు ముందుకొచ్చిన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా కాఫీ బ్రాండ్లను పరిచయం చేసిన ఆయన.. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా గుర్తింపు పొందారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...