
ఢిల్లీని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘ఢిల్లీ కో కూడే సే ఆజాదీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలో ప్రతి నెలా అత్యంత పరిశుభ్రంగా నిలిచే మున్సిపల్ వార్డుకు రూ.కోటి చొప్పున అభివృద్ధి నిధులను అందించనున్నారు. ఏడాది మొత్తంలో గరిష్టంగా రూ.12 కోట్ల వరకు నిధులు పొందే అవకాశం ఉంటుంది.
అయితే ఈ పోటీలో విజయం సాధించాలంటే వార్డు పరిధిలో పరిశుభ్రత విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్క చెత్త ఫిర్యాదు వచ్చినా ఆ వార్డును పోటీ నుంచి తొలగిస్తామని సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.
ఇదే కాకుండా ఢిల్లీని పరిశుభ్రంగా మార్చేందుకు రాబోయే రెండు నెలల్లో నగరవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలను కూడా పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
దేశ రాజధాని ఢిల్లీని మరింత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో అత్యంత పరిశుభ్రంగా నిలిచే మున్సిపల్ వార్డుకు ప్రతి నెలా రూ.కోటి చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు అందించనున్నట్లు సీఎం రేఖా గుప్తా సోమవారం ప్రకటించారు. ఇలా ఏడాది పాటు ఎంపికైన వార్డుకు మొత్తం రూ.12 కోట్ల వరకు నిధులు లభించనున్నాయి.
అయితే ఈ పోటీలో విజయం సాధించడం అంత సులభం కాదు. ఆయా వార్డులకు సంబంధించి ప్రజలు లేదా నెటిజన్లు చిన్నపాటి సమస్యపై ఫిర్యాదు చేసినా.. ఆ వార్డును వెంటనే పోటీ నుంచి తొలగిస్తారు. ఫిర్యాదులు లేని వార్డులను మాత్రమే పరిశీలించి, పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉన్న వార్డును విజేతగా ఎంపిక చేస్తారు. విజేత వార్డుకు ప్రతి నెలా రూ.1 కోటి చొప్పున ప్రత్యేక నిధులు అందజేయనున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ప్రధాన కార్యాలయంలో సీఎం రేఖా గుప్తా ‘ఢిల్లీ కో కూడే సే ఆజాదీ – స్వచ్ఛతా అభియాన్ 2026’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాధారణ పారిశుద్ధ్య ప్రచారం అక్టోబర్ 2 వరకు కొనసాగనుండగా, నగరంలోని వార్డుల మధ్య స్వచ్ఛత పోటీ మాత్రం ఏడాది పాటు కొనసాగుతుందని సీఎం తెలిపారు.
ప్రతి నెలా అత్యుత్తమ పనితీరు కనబరిచే వార్డుకు సీఎం అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి రూ.కోటి చొప్పున అదనపు నిధులు అందించనున్నారు. దీంతో ఏడాదిలో ఒక వార్డు గరిష్టంగా రూ.12 కోట్ల వరకు అభివృద్ధి నిధులను పొందే అవకాశం ఉంటుంది.
వార్డుల ర్యాంకింగ్‌ను స్వతంత్ర సంస్థల నివేదికలు, అధికారుల తనిఖీలు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సోషల్ మీడియా ద్వారా అందే సమాచారం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే ఏదైనా వార్డులో చెత్త పేరుకుపోయినట్లు నిజమైన ఫిర్యాదు నమోదైతే.. ఆ వార్డు పోటీకి అనర్హత కోల్పోతుందని సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు.
పారిశుద్ధ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వ విభాగం బాధ్యత కాదని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి ఉమ్మడి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.

