పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు!

Date:

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రామ్ మాధవ్‌లకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. రాజకీయ, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇద్దరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో పురంధేశ్వరి, రామ్ మాధవ్‌ల అనుభవం, సామర్థ్యం కీలకంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అదేవిధంగా బీజేపీ జాతీయ స్థాయిలోని అన్ని విభాగాలకు సంయుక్త సమన్వయకర్తగా ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో వివిధ బాధ్యతలు పొందిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాసేవ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నూతన జాతీయ కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...