16 ఏళ్లకే ఛార్టెడ్ అకౌంటెంట్.. భారతీయ టీనేజర్ ప్రపంచ రికార్డు.. ఎవరీ లక్ష్మణన్?

Date:

పదహారేళ్ల వయసు అంటే ఎన్నో సందేహాలు, అయోమయాలతో కూడిన టీనేజ్ దశ. భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకోవాలనే విషయంలో ఈ వయసులో చాలామంది యువతలో గందరగోళం కనిపిస్తుంది. అయితే తమిళనాడుకు చెందిన లక్ష్మణన్ మేయప్పన్ మాత్రం తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా, అదే రంగంలో ప్రపంచ రికార్డు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న లక్ష్మణన్ మేయప్పన్ అత్యంత చిన్న వయసులో చార్టర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఘనతతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ అరుదైన ప్రపంచ రికార్డు గుర్తింపు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడిని వరించింది.

ఏ కెరీర్‌ను ఎంచుకోవాలనే దానిపై టీనేజ్‌లో ఆలోచించడం సహజం. కానీ తమిళనాడు సంతతికి చెందిన 16 ఏళ్ల లక్ష్మణన్ మెయ్యప్పన్ మాత్రం ఈ వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్ (CA) కోర్సును విజయవంతంగా పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, లక్ష్మణన్ 16 సంవత్సరాల 141 రోజుల వయసులో CA అర్హత సాధించి, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పురుష చార్టర్డ్ అకౌంటెంట్‌గా రికార్డు నెలకొల్పాడు. టీనేజ్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా, కొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో పదో తరగతి బోర్డు పరీక్షలు పూర్తయిన వెంటనే మెయ్యప్పన్‌కు ఫైనాన్స్ రంగంపై ఆసక్తి పెరిగింది. 15 ఏళ్ల వయసులోనే ఏసీసీఏ (ACCA) కోర్సులో చేరిన ఆయన.. కేవలం ఏడాది వ్యవధిలోనే ఆ కోర్సును పూర్తి చేశారు.

అంతటితో ఆగకుండా ఉన్నత విద్యను కొనసాగించిన మెయ్యప్పన్.. సీఎఫ్ఏ (CFA) చార్టర్‌ను కూడా సాధించారు. ప్రస్తుతం ఎంఎస్సీ (MSc) ఫైనాన్స్ కోర్సు అభ్యసిస్తున్నారు. మరోవైపు, దుబాయ్‌లోని ‘సెంచరీ ఫైనాన్షియల్’ సంస్థలో సీనియర్ రిసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. పెట్టుబడులు, ఆర్థిక మార్కెట్ల విశ్లేషణతో పాటు కీలకమైన ఆర్థిక నిర్ణయాల్లోనూ ఆయన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...