
ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష రద్దు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష పూర్తైన కొన్ని గంటల్లోనే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెలువడటంతో అధికారులు పరీక్షను రద్దు చేశారు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఓ ప్రశ్నాపత్రం, అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నాపత్రంతో సుమారు 70 శాతం మేర సరిపోలినట్లు విద్యార్థులు ఆరోపించారు.
ఈ ఘటనపై ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీగా నిరసనలు చేపట్టారు. పరిస్థితిని పరిశీలించేందుకు విశ్వవిద్యాలయం ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు, పరీక్షను రద్దు చేసి తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం నిర్వహించిన బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్షను పూర్తిచేసిన కొద్దిసేపటికే అధికారులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షకు సంబంధించిన ఓ ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం కాగా, అది అసలు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రంతో దాదాపు 70 శాతం వరకు సరిపోలినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయ యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టి, పరీక్ష రద్దు నిర్ణయం తీసుకుంది.
రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా 34 కళాశాలల్లో గురువారం నిర్వహించిన పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌కు సంబంధించిన ‘ఎంటమాలజీ’ (AENT 221) పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అయితే పరీక్ష ముగిసిన వెంటనే వాట్సాప్‌లో ఓ ప్రశ్నాపత్రం విస్తృతంగా సర్క్యులేట్ కావడం అనుమానాలకు తావిచ్చింది. ఆ పేపర్‌ను అసలు ప్రశ్నాపత్రంతో పోల్చగా దాదాపు 70 శాతం ప్రశ్నలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటన విద్యార్థులు, యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

