మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

Date:

టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత జట్టు (Team India) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (ఆదివారం)అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు. వారి తర్వాతి టార్గెట్ ఏంటో వివరించాడు. ‘మా తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్‌లోబంగారు పతకం గెలవడం. అలాగే 2028లో జరిగే టీ20 వరల్డ్ కప్‌ గెలవడం’ అని సూర్యకుమార్ అన్నాడు.

దాదాపు 128 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. లాస్‌ఏంజిలెస్‌లో 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో(Olympics cricket) టీ20 ఫార్మాట్లో క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. విజేతగా నిలిచిన జట్టు బంగారు పతకం బహుమతిగా అందుకుంటుంది. ఇలా 128 ఏళ్ల తర్వాత ఒలిపింక్స్ లో క్రికెట్ ఉండటంతో.. తొలి టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని టీమిండియా టీ 20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ స్పష్టం చేశాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...