
టెక్స్టైల్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఓ సెమినార్ ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. అదే స్ఫూర్తితో ఏవియేషన్ రంగంవైపు అడుగులు వేసిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్.. న్యూజిలాండ్‌లో పైలట్ శిక్షణ పూర్తి చేసి, అనంతరం స్పైస్‌జెట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. దశాబ్దానికి పైగా విమానయాన రంగంలో పనిచేస్తూ, తన అనుభవం, సమయస్ఫూర్తితో గాల్లో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు.
అయితే ఏవియేషన్‌లోకి రావడం ఆయన ముందుగా అనుకున్న ప్రయాణం కాదు. వాస్తవానికి ఆయన కుటుంబం టెక్స్టైల్ వ్యాపారంలో ఉండటంతో, భవిష్యత్తులో తాను కూడా అదే రంగంలో స్థిరపడాలని భావించారు. అందుకే తన చదువును కూడా టెక్స్టైల్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్కు అనుగుణంగా కొనసాగించారు. కానీ ఓ సెమినార్లో కలిగిన ఆసక్తి ఆయన కెరీర్ దిశనే మార్చేసింది. అలా అనుకోకుండా ప్రారంభమైన ఏవియేషన్ ప్రయాణం.. చివరకు ఆయనను వందలాది ప్రాణాలకు రక్షణగా నిలిచిన అనుభవజ్ఞుడైన పైలట్‌గా తీర్చిదిద్దింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం FZ1073 కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడిలో గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కమర్షియల్ విమానయాన రంగంలో దశాబ్దానికి పైగా అనుభవంతో పాటు దాదాపు 9,750 గంటల ఫ్లైట్ అనుభవం ఉన్న మచ్ఛార్.. వాస్తవానికి చిన్నతనంలో పైలట్ కావాలని కలలు కనలేదు. తన కుటుంబానికి చెందిన టెక్స్టైల్ వ్యాపారంలో స్థిరపడాలన్నదే ఆయన అసలు ఆలోచన.
ఈ విషయాలను ఆయన గతేడాది యూట్యూబర్ జలక్ మెహతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుటుంబ వ్యాపారంలో కొనసాగాలనే ఉద్దేశంతో టెక్స్టైల్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేసిన మచ్ఛార్.. మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తున్న సమయంలో ఓ సెమినార్ ద్వారా ఏవియేషన్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు.
ఆ ఆసక్తే ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ముంబయి నుంచి పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లిన ఆయన.. శిక్షణ అనంతరం స్పైస్‌జెట్‌లో పైలట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్లై దుబాయ్‌లో చేరి తన విమానయాన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇలా అనుకోకుండా మొదలైన ఏవియేషన్ కెరీర్లో దశాబ్దానికి పైగా అనుభవాన్ని, వేల గంటల ఫ్లైట్ టైమ్‌ను సంపాదించిన మచ్ఛార్.. తాజాగా FZ1073 ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు.
పాఠశాల విద్య పూర్తైన తర్వాత కుటుంబ టెక్స్టైల్ వ్యాపారంలో కొనసాగాలనే ఉద్దేశంతో మచ్ఛార్ టెక్స్టైల్ ఇంజనీరింగ్‌లో చేరారు. అనంతరం ముంబయిలోని వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు.
అయితే మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఆయన కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. ఓ ఏవియేషన్ సెమినార్‌కు హాజరైన మచ్ఛార్‌కు అక్కడ విమానయాన రంగంపై ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా విమానాలు నడపాలనే ఆలోచన ఆయనను ఆకర్షించింది. ఆ ఆసక్తే చివరకు ఆయనను పైలట్‌గా మారే దిశగా అడుగులు వేయించింది.
