గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం లభించింది.

గుడివాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారి జి. బాలసుబ్రహ్మణ్యం విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

By Ramya