మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌ భారీగా పెరిగిన చికెన్‌ ధర

Date:

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తు్న్న చికెన్‌ ధరలు.. తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతోంది. ధరలు కొండెక్కుతున్నాయి. ఆదివారం బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.340 వరకు ఉండగా, అదే వారం రోజుల కిందట కిలో చికెన్ ధర రూ.260 వరకు ఉంది.

చికెన్‌ ధరలు ఒక్కసారి పెరగడంతో సామాన్యులు కష్టంగా మారిపోయింది. ముందే యుద్దం కారణంగా ఒక్కొక్కటిగా ధరలు పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చికెన్‌ ధరలు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు కోడి గుడ్డు ధర మాత్రం పడిపోతున్నాయి. గతంలో ఒక గుడ్డు ధర రూ.8 వరకు ఉండగా.

ఇప్పుడు రూ.4..20 పైసల వద్ద కొనసగుతోంది. కోడిగుడ్లు ఎగుమతి ఆగిపోవడంతో ధరలు పడిపోయాయని పౌల్ర్టీ యజమానులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లు తమిళనాడుకు తీసుకెళ్లి అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతాయి. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా గల్ఫ్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గుడ్డు ధర ఆమాంతంగా పడిపోయింది.

చికెన్‌ ధర పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పాదకత తగ్గడం, రంజాన్‌, ఇతర ఫంక్షన్ల కారణంగా చికెన్‌ ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు చికెన్‌ దుకాణ వ్యాపారులు. డిమాండ్‌కు సరిపడా చిన్న బ్రాయిలర్‌ కోళ్లు కూడా దొరకడం లేదట. అలాగే పౌల్ట్రీ నిర్వాహకులు పిల్లల పెంపకం ఆపేడయం కూడా మరో కారణం అంటున్నారు. కోళ్లు డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేని కారణంగా చికెన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...