గుర్రపు పందేలకు అలవాటు పడి బ్యాంకుకే కన్నం.. నిందితుడి అరెస్ట్‌, భారీగా నగదు స్వాధీనం

Date:

జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు.

జల్సాలు, గుర్రపు పందేలకు అలవాటు పడిన ఓ వ్యక్తి నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకును మోసం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిరలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడకశిరలోని కెనరా బ్యాంకులో సుందరేష్‌ ఆచారి అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 872 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రూ.70.66 లక్షలు రుణంగా తీసుకున్నాడు.

జూలై 24న బ్యాంకు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడు సుందరేష్‌ను వైబీహళ్లి క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో సుందరేష్‌ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పరిచయాలు పెంచుకుని, మాయమాటలతో వారి పేర్లపై నకిలీ బంగారు రుణ ఖాతాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా వచ్చిన డబ్బును బెంగళూరుకు తీసుకెళ్లి జల్సాలకు, గుర్రపు పందేలకు ఖర్చు చేసేవాడని వెల్లడైంది.

నిందితుడి నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...