అమరావతిలోనే ఏపీ భవిష్యత్.. మావిగన్ అనే నేతలు ఇక్కడికి వచ్చి చూడాలి: మంత్రి అనిత

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ అమరావతి పర్యటన చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న భవనాలను పరిశీలించిన మంత్రులు ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. మావిగన్ గురించి మాట్లాడుతున్న నాయకులు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పరిశీలించాలని మంత్రి అనిత అన్నారు. కేవలం నాయకులే కాదని, ప్రజలు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమరావతితోనే సాధ్యమని, వైఎస్ జగన్ గతంలో మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేశారంటూ విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, ఆత్మ గౌరవం అన్నీ అమరావతిలోనే కనిపిస్తాయని హోం మంత్రి అనిత అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆమె అమరావతిలోని నిర్మాణ పనులను పరిశీలించారు. అమరావతిలో భవన నిర్మాణాలను మంత్రి నారాయణ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అప్పట్లో మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి, ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా గతంలో ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ప్రజలను మోసం చేశారంటూ విమర్శించారు. 2014 – 19 మధ్యకాలంలో మూడు రాజధానుల పేరుతో ఆయన కాలయాపన చేశారన్నారు. మావిగన్ గురించి మాట్లాడుతున్న నేతలు.. అమరావతికి వచ్చి చూడాలని చెప్పాలరు. అమరావతిలో నిర్మించే భవనాలు కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే కాదని, ప్రజలు కూడా వచ్చి చూడాలంటూ ఆమె ఆహ్వానించారు.

అమరావతిలో భవన నిర్మాణాలను చూసి చాలా సంతోషంగా ఉందని మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌తో భవనాల నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు. అమరావతిలో అభివృద్ధి కోసం రైతులు భూములు ఇచ్చారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఈ ప్రాంతం అభివృద్ధిపై దృష్టిపెట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాలను నిర్మించేలా ఇప్పటికే పనిచేస్తున్నారని చెప్పారు. సెక్రటేరియట్, హెచ్‌ఓడీ బిల్డింగ్‌లను చాలా బాగా నిర్మిస్తున్నారని అభినందించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...