• నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలను పుష్పాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులకు స్వామివారి వాహనసేవలను కనులారా వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

ఆదివారం రాత్రి అంకురార్పణ

  • చాంద్రమానం ప్రకారం మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో భాద్రపద మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలోని దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
  • నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఉత్సవాల్లో భాగంగా వివిధ వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముఖ్యమైన వాహనసేవల తేదీలు ఇవే

  • అక్టోబరు 16: గరుడ వాహనసేవ
  • అక్టోబరు 17: పుష్పక విమాన సేవ
  • అక్టోబరు 19: స్వర్ణ రథోత్సవం
  • అక్టోబరు 20: చక్రస్నాన వేడుక

వాహనసేవల సమయాలు

  • సాధారణంగా వాహనసేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే గరుడ వాహనసేవ ప్రత్యేకంగా సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరగనుంది.
  • నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *