ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సెర్ప్‌ ద్వారా హోమ్‌ ఆయా, జెరియాట్రిక్‌ కేర్‌ టేకర్‌ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ అందించనుంది. ఈ శిక్షణ సమయంలో మహిళలకు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పించనున్నారు. నైపుణ్యాలను పెంపొందించి, మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు పథకాలతో పాటు రుణాలు అందిస్తూ పరిశ్రమలు స్థాపించేందుకు, వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి మహిళలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన డ్వాక్రా మహిళలకు హోమ్‌ ఆయా, జెరియాట్రిక్‌ కేర్‌ టేకర్‌ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సెర్ప్‌ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా హోమ్‌ ఆయా, జెరియాట్రిక్‌ కేర్‌ టేకర్‌ శిక్షణ అందించనుంది. ఈ శిక్షణలో భాగంగా వృద్ధులు, రోగులకు సేవలు అందించే విధానం, ప్రథమ చికిత్స, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై మహిళలకు అవగాహన కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారికి బ్యాంకింగ్‌, డిజిటల్‌ లావాదేవీలు, ఆర్థిక నిర్వహణ అంశాల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి సౌకర్యం కల్పించనుండగా, పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే డ్వాక్రా మహిళలతో అరకు కాఫీ, ఛాయ్‌ రాస్తా, తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించడంతో పాటు, రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. అలాగే స్కూటీలు, ఆటోలు అందించడంతో పాటు ర్యాపిడో వంటి సంస్థలతో ఒప్పందాల ద్వారా రైడర్లుగా పనిచేసే అవకాశాలను కల్పిస్తోంది. మరోవైపు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ సొంతంగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహిస్తోంది. తాజాగా కొత్త రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా డ్వాక్రా మహిళలకు నైపుణ్యాలను పెంపొందించి, వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చర్యలు చేపడుతోంది

డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌ కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ పేరుతో మహిళల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13 నుంచి విజయవాడలోని పున్నమిఘాట్‌లో ‘సరస్‌’ పేరుతో డ్వాక్రా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అదే రోజు నుంచి ఆన్‌లైన్‌ విక్రయాలను కూడా ప్రారంభించనున్నారు.

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ఒకే బ్రాండ్‌ గుర్తింపు కల్పించడంతో పాటు, మార్కెటింగ్‌ అవకాశాలను పెంచేందుకు స్వయం ఏపీ వేదికగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మహిళలు తయారు చేసిన వస్తువులకు మరింత గుర్తింపు, మెరుగైన విక్రయ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌, లోగోను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *