ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

శనివారం మధ్యాహ్నానికే పిటిషన్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై చంద్రబాబు ఢిల్లీలోని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, పురపాలక శాఖల తరఫున సుప్రీంకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

ఈ వారంలోనే పిటిషన్ దాఖలు చేస్తే వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి జాప్యం లేకుండా శనివారమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

By Rajini