
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ 22 మందితో కూడిన రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మహిళలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, యువతకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది అభ్యర్థుల్లో 18 మంది మహిళలు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయి నివేదికలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల రెబల్స్ తిరుగుబాటుతో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీ 22 మందితో కూడిన రెండో అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాలో మచిలీపట్నం మేయర్ అభ్యర్థితో పాటు 21 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదా
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదాను టీడీపీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రెండో జాబితాలో మహిళలు, గ్రాడ్యుయేట్లు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. మొత్తం 22 స్థానాల్లో 18 స్థానాలను మహిళలకు కేటాయించడం విశేషంగా నిలిచింది. అలాగే 22 మంది అభ్యర్థుల్లో 16 మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారు. వీటితో పాటు యువతకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు తెలుస్తోంది.
టీడీపీ రెండో జాబితాలో అభ్యర్థుల పూర్తి వివరాలు
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆకివీడు: నిలోఫర్ షేక్
- గుంతకల్లు: యశోద
- జంగారెడ్డిగూడెం: రొంగల అనుష
- కదిరి: షేక్ సమీరా
- కళ్యాణదుర్గం: బుట్న లక్ష్మి
- కొండపల్లి: కన్నెకంటి అమూల్య
- కొవ్వూరు: జొన్నలగడ్డ రాధారాణి
- నాయుడుపేట: షకీరా
- నందిగామ: శాకమూరి వంశీధర్
- నందికొట్కూరు: ఈ.ఎం. సబురున్నిసా
- నర్సీపట్నం: చింతకాయల పద్మావతి
- ప్రొద్దుటూరు: నంద్యాల రాఘవరెడ్డి
- వెంకటగిరి: దొంతు శారద
- ఉయ్యూరు: చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్
- ఏలేశ్వరం: యార్లగడ్డ అక్షిత
- ఎమ్మిగనూరు: మాచాని సునీత
- బేతంచెర్ల: ఐ. లోకేశ్ గౌడ్
- చీరాల: యెరిచర్ల హనీ స్పందన
- బుచ్చిరెడ్డిపాలెం: దొడ్ల విజయలక్ష్మి
- డోన్: కోట్ల సుజాతమ్మ
- గుత్తి: గోవిందరాజులు తమిళ్ సెల్వి
వైసీపీని ఎదుర్కొనేలా టీడీపీ వ్యూహాలు
ఇటీవలే 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ, తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వహించిన సర్వేలు, నివేదికలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా విడుదల చేసిన రెండో జాబితాతో కలిపి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు మొత్తం 58 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అభ్యర్థుల ఎంపిక పార్టీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
