సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద నమోదైన కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విచారణలను వేగవంతం చేయడంతో పాటు, సామాన్యులకు సమాచార హక్కు చట్టాన్ని మరింత చేరువ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు 7,034 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.

సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆర్టీఐ చట్టం సామాన్యుల చేతిలో శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల పనితీరుపైనా సమాచారం పొందేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రజలకు సకాలంలో సమాచారం అందించడం, పెండింగ్‌ కేసులను తగ్గించడం లక్ష్యంగా కమిషన్‌ పనిచేస్తోందని వివరించారు.

ఆన్‌లైన్‌ విధానంలోనే 95 శాతం విచారణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తొమ్మిది మందిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లాకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *