విశాఖ స్టీల్‌ప్లాంట్‌‌నుంచి CISF బలగాల ఉపసంహరణ?.. 3 నెలల నోటీస్ , నవంబరు 17 డెడ్‌లైన్!

Date:

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్నిమాపక సేవలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్‌ (CISF) బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సీఐఎస్ఎఫ్ సౌత్ సెక్టార్, చెన్నై హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. 2026 నవంబర్ 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలోని సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభించాలని, ఇందుకోసం మూడు నెలల నోటీసు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

ఈ మేరకు జారీ అయినట్లు చెబుతున్న ఉత్తర్వుల కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

2024 వరకు స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1,500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించగా, ఆ తర్వాత దశలవారీగా బలగాలను తగ్గించారు. ప్రస్తుతం సెక్యూరిటీ, ఫైర్ విభాగాల్లో 1,033 మంది, 298 మంది ఉన్నట్లు సమాచారం.

సీఐఎస్ఎఫ్ ఉపసంహరణ అనంతరం భద్రత, ఫైర్ సేఫ్టీ బాధ్యతలను ఎవరు చేపడతారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గతంలో ఉపసంహరించిన సిబ్బంది స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్‌ను నియమించిన నేపథ్యంలో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, సీఐఎస్ఎఫ్ ఉపసంహరణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...