కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ “అమరజీవి జలధార – జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ శంకుస్థాపన ఫలకాలను ఆవిష్కరించారు.
రూ.30,156.12 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని కుళాయి కనెక్షన్ ద్వారా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు.