జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Date:

అమరావతి, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ. భారతీయ సంస్కృతిని చాటే చేనేత కళను ముందుకు తీసుకువెళుతున్న చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగానే ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ నేతన్నలకు దన్నుగా ఉన్నామని చెప్పుకొచ్చారు. నేడు 71,536 చేనేత కుటుంబాలకు ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా సాయం చేస్తున్నామన్నారు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున రూ.179 కోట్లు నేతన్నలకు అందిస్తున్నామని సీఎం అన్నారు. చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సాయం అందిస్తోందని వెల్లడించారు. ‘అంతా చేతులు కలుపుదాం. చేనేత కళను కాపాడుదాం’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులందరికీ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోందన్నారు. చేనేత కళాకారుల నైపుణ్యంతో రూపుదిద్దుకునే వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనోపాధి కల్పిస్తున్న రంగాల్లో చేనేత ఒకటని చెప్పుకొచ్చారు.

చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రజాప్రభుత్వం ‘నేతన్న సేవలో’ కార్యక్రమం కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వీవర్స్ శాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అందరం చేనేత ఉత్పత్తులను ఆదరిద్దామని.. వాటి వినియోగాన్ని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. నేతన్నలకు అండగా నిలిచి, చేనేత కళను భావితరాలకు అందిద్దామంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...