వింతగా కనిపించే కుక్కల కోసం పోటీ, విజేతగా జిన్నీ లూ

Date:

అందాల పోటీలు మనకు తెలుసు. కానీ ప్రపంచంలోనే అత్యంత వికారమైన కుక్కను ఎంపిక చేసే పోటీ గురించి విన్నారా? అమెరికాలో ఏటా నిర్వహించే ఈ ప్రత్యేక పోటీలో 2026 విజేతగా ఆరేళ్ల పగ్‌ జాతికి చెందిన జిన్నీ లూ నిలిచింది.

నాలుగో ప్రయత్నంలో విజయం

కాలిఫోర్నియాలోని శాంటా రోసాలో ఆగస్టు 14న జరిగిన ఈ పోటీలో జిన్నీ లూ విజేతగా నిలిచింది. ఈ ఏడాది పోటీ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మరో విశేషం. ఇప్పటికే మూడుసార్లు పాల్గొన్న జిన్నీ లూ.. 2025లో రెండో స్థానంలో నిలిచింది. నాలుగోసారి మాత్రం టైటిల్‌ను సొంతం చేసుకుంది.

పొడవుగా బయటకు కనిపించే నాలుక, పెద్ద కళ్లు, ముఖంపై ముడతలు జిన్నీ లూ ప్రత్యేకతలు. ఈ పోటీ కుక్కలను అవమానించేందుకు కాదని.. భిన్నంగా కనిపించే జంతువుల్లోనూ ప్రత్యేకమైన అందం, వ్యక్తిత్వం ఉంటాయని చాటిచెప్పడమే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.

దక్షిణ కొరియా నుంచి కాలిఫోర్నియా వరకు..

జిన్నీ లూ కథ కూడా ఆసక్తికరమే. దక్షిణ కొరియాలోని పర్వత ప్రాంతాల్లో తీవ్ర చలిలో ఓ చెక్క పెట్టెలో ఉన్న దానిని రక్షించారు. అనంతరం పగ్‌ రెస్క్యూ సంస్థల సహకారంతో కొత్త జీవితం లభించింది.

సుమారు నాలుగేళ్ల క్రితం మిషెల్‌ గ్రేడీ జిన్నీ లూను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం అది సాధారణ పెంపుడు కుక్కగా ఉండటంతో పాటు.. రక్షించబడిన జంతువులపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.

ఈ విజయంతో మిషెల్‌ గ్రేడీకి 5,000 డాలర్ల బహుమతి లభించింది. రెండో స్థానంలో నిలిచిన పింకీకి 3,000 డాలర్లు, మూడో స్థానంలోని ఒట్టోకు 2,000 డాలర్లు అందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...