
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. 2024 జనవరి, జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు డీఏలు కలిపి మొత్తం 6.27 శాతం మేర పెరుగుదల లభించనుంది. పెంచిన డీఏను 2026 అక్టోబర్ నెల జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నారు.
ఇక గత కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు. యూజీసీ, ఏఐసీటీఈ పరిధిలోని ఉద్యోగులకు కూడా ఈ డీఏ పెంపు వర్తించనుంది.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. 2024 జనవరి, జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పెండింగ్ డీఏలను విడుదల చేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
రెండు డీఏలను కలిపితే ఉద్యోగుల డీఏలో మొత్తం 6.27 శాతం మేర పెరుగుదల ఉండనుంది. పెంచిన డీఏను 2026 అక్టోబర్ నెల వేతనంతో కలిపి చెల్లించనున్నారు. దీంతో నవంబర్ 1న ఉద్యోగుల ఖాతాల్లో పెరిగిన డీఏతో కూడిన జీతం జమ కానుంది. ఈ డీఏ పెంపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
రివైజ్డ్ పే స్కేల్-2020 కింద పనిచేస్తున్న ఉద్యోగులకు 2024 జనవరి నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచారు. అదే విధంగా 2024 జూలై నుంచి డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2015 పే స్కేల్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రెండు విడతల్లో డీఏ పెంపు వర్తించనుంది. 2024 జనవరి నుంచి డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి, 2024 జూలై నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి పెంచారు.
యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్-2016 కింద పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం డీఏ పెంపును వర్తింపజేసింది. 2024 జనవరి నుంచి డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి పెంచగా.. 2024 జూలై నుంచి 53 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్-2006 ఉద్యోగులకు డీఏను 230 శాతం నుంచి 239 శాతానికి, 2024 జూలై నుంచి 246 శాతానికి పెంచింది.
పెంచిన డీఏను 2026 అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనున్నారు. దీంతో నవంబర్ 1న పెరిగిన డీఏతో కూడిన జీతం ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుంది.
ఇక గత కాలానికి సంబంధించిన డీఏ బకాయిల చెల్లింపుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2024 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఉన్న తొలి డీఏ బకాయిలను 33 వాయిదాల్లో చెల్లించనున్నారు. అలాగే 2024 జూలై నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఉన్న రెండో డీఏ బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ డీఏ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయనున్నారు. సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా బకాయిలను విడతల వారీగా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు రెండు డీఏలు (డీయర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్ (డీయర్నెస్ రిలీఫ్) మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు డీఏలను విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదే సమయంలో పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. వారి నెలవారీ వేతనాలను అదనంగా రూ.100 చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మొత్తం ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు డీఏలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. దసరా పండుగ సందర్భంగా రెండు డీఏలు మంజూరు కావడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మిగిలిన నాలుగు పెండింగ్ డీఏలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో మిగిలిన డీఏలను కూడా విడుదల చేస్తుందా, లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
