తిరుపతి : తిరుపతి నగరపాలక సంస్థ 11వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి జ్యోత్స్న శుక్రవారం బైరాగిపట్టెడలోని భగత్‌సింగ్‌ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు.

జ్యోత్స్న ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. బ్యాలెట్‌ పేపర్‌పై కార్పొరేటర్‌ అభ్యర్థిగా తనకు, మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

తన భర్త శ్రీధర్‌ వర్మ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని జ్యోత్స్న తెలిపారు. తమకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే డివిజన్‌లోని డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీధర్‌ వర్మ, యూనిట్‌ ఇన్‌చార్జి రాము, వార్డు అధ్యక్షురాలు భారతి, బూత్‌ కన్వీనర్లు హరి, గుణ, మోనిష్‌, సుబ్బు, పెంచలయ్య, తిలక్‌, శంకర్‌, వాణి, మంజులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *