కారు డ్రైవర్ కొడుకు ఐటీ కంపెనీ సీఈవో అయ్యాడు.. భద్రాచలం యువకుడి స్ఫూర్తిదాయక ప్రస్థానం

Date:

కారు డ్రైవర్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన భద్రాచలానికి చెందిన కుంజా రాము అనే యువకుడు స్వయంకృషితో ఎదిగి సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా మారి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. ఆయన స్థాపించిన ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్ సంస్థ హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక తెలంగాణ గ్లోబల్ ఎలైట్-2026 వేడుకల్లో ఉత్తమ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. సినీ నటి అదాశర్మ చేతుల మీదుగా రాము ఈ అవార్డును అందుకున్నారు. కాగా, ఆయన రైతుల కోసం తీసుకొచ్చిన ఆగ్రోస్ నెక్సస్ ఏఐ ప్లాట్‌ఫామ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చునని నిరూపించాడు భద్రాచలం పట్టణానికి చెందిన యువ వ్యాపారవేత్త కుంజా రాము. ఒక సాధారణ కారు డ్రైవర్ కుమారుడిగా అనేక కష్టాలను అధిగమించి ఐటీ కంపెనీకి సీఈవోగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతోమంది యువతకు ఆదర్శం. ప్రముఖ ప్రైమ్ టైకూన్ మీడియా సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ ఎలైట్-2026 పురస్కారాల వేడుకల్లో రాము ప్రతిభకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన నేతృత్వంలోని ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్ సంస్థ ఉత్తమ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది.

భద్రాచలానికి చెందిన కుంజా రాఘవులు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వద్ద వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి అందించిన ప్రోత్సాహంతో చదువు విలువ తెలుసుకున్న ఆయన కుమారుడు రాము ప్రాథమిక విద్యాభ్యాసాన్ని భద్రాచలం, పాల్వంచల్లో పూర్తి చేశారు. అనంతరం సత్తుపల్లిలోని ఇంజినీరింగ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రతిభతో తొలినాళ్లలో అమెరికాలో ఐటీ ఉద్యోగం సాధించిన రాము.. సొంతంగా ఏదైనా సాధించాలనే తపనతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వేరే సంస్థలో పనిచేస్తూనే.. 2016లో రూ. 50 లక్షల పెట్టుబడితో ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్ పేరిట సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు చూపుతూ సంస్థను ముందుకు నడిపారు. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక లావాదేవీలు రూ. 10 కోట్ల మార్కును చేరుకోగా.. 15 మందికి పైగా నిరుద్యోగులకు నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.

కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆహార నాణ్యత, ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో రాము ఆలోచన అగ్రి-టెక్ వైపు మళ్లింది. రైతులు పండించే నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు ఆగ్రోస్ నెక్సస్ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎకో సిస్టమ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు తమ ధాన్యాన్ని ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలుదారులకు విక్రయించవచ్చు. కొనుగోలుదారులు తమకు కావలసిన పంట పరిమాణాన్ని బట్టి ముందస్తుగానే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే వెసులుబాటు కల్పించారు. పంట చేతికి వచ్చిన తర్వాత ఉత్పత్తులను కొనుగోలుదారులు తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...