తెలంగాణ అమ్మాయిలకు గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ పూర్తి చేసిన వారికి ఉచిత పైలట్ ట్రైనింగ్

Date:

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పేదింటి అమ్మాయిలకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణ అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ మధ్య ఎంవోయూ కుదిరింది. గివింగ్ వింగ్స్ టూ ఫ్లై కార్యక్రమం కింద 20 నెలల శిక్షణలో కమర్షియల్ పైలట్ లైసెన్స్, ఏటీఆర్ టైప్ రేటింగ్‌తో పాటు వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం ఉచితంగా అందించనున్నారు. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు తీపి కబురు. పేదింటి అమ్మాయిలకు కమర్షియల్ పైలట్‌గా ఎదిగే అరుదైన అవకాశాన్ని కల్పిస్తూ ఇంటర్ విద్యాశాఖ, ఇండిగో సంస్థ సీఎస్‌ఆర్ విభాగం ఇండిగోరీచ్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 4న) ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హత కలిగిన విద్యార్థినులకు అంతర్జాతీయ ప్రమాణాలతో పైలట్ శిక్షణ అందించనున్నారు.

ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. గివింగ్ వింగ్స్ టూ ఫ్లై కార్యక్రమం కింద ఇండిగోరీచ్, భారత్ కేర్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ శిక్షణను అమలు చేయనున్నాయి. విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ శిక్షణ మొత్తం 20 నెలల పాటు కొనసాగుతుంది. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL)తో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్ శిక్షణ కూడా అందించనున్నారు. విమానయాన రంగంలో ఉద్యోగాలకు అవసరమైన ఈ అర్హతలతో విద్యార్థినులు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను పొందే వీలుంటుంది. ఈ శిక్షణలో విద్యార్థినులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అన్ని ఖర్చులను ఇండిగోరీచ్, భారత్ కేర్ సంస్థలు భరిస్తాయి. శిక్షణ ఫీజుతో పాటు వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం, ఏటీఆర్ టైప్ రేటింగ్ వంటి అన్ని సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. దీంతో సాధారణ కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినులు కూడా పైలట్‌గా తమ కలను సాకారం చేసుకునే అవకాశం లభించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...