Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త. ప్రభుత్వం బిగ్ డెసిషన్.

Date:

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త. ఇక నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, విభజన మరింత సులువు కానుంది. ఈ మేరకు సులభంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునేలా సేవలను మెరుగుపర్చాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలోని ఆర్బీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్టీజీఎస్ సేవలపై నారా లోకేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేషన్ సేవలను సులభతరం చేయాలని సూచించారు. రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చడం, తొలగించడం, కార్డులను విభజించడం వంటి సేవలు ప్రజలు సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరతగతిన ఈ సేవలను మెరుగుపర్చాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి పత్రాల జారీలో ఉన్న అడ్డంకులను తొలగించి వేగంగా ప్రజలు పొందేలా చేయాలని లోకేష్ సూచించారు.

వీటిల్లో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ పనులు జులై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రజలకు చేరువచేయాలని సూచించారు.

నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇక విద్యార్థులకు విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్లు అభ్యర్థి ఆధార్ నెంబర్ ద్వారా డీజీ వెరిఫై ఆధారంగా పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న రేషన్ సేవలను మరింత సులభతరం చేయాలని పేర్కొన్నారు.

అన్ని శాఖలను వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేశారు. దీంతో వాట్సప్ నుంచే ఏ సేవ అయినా పొందవచ్చు. దీని వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...