తెలంగాణలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నో టెన్షన్, ఆగస్టు 31 వరకు ఛాన్స్

Date:

తెలంగాణలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. రాష్ట్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువును మరో నెల పొడిగించింది. ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ పెండింగ్ ఉన్నవారు వెంటనే పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు కోరుతున్నారు.

తెలంగాణలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం ఊరట కల్పించింది.. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కారణంగా ఆగస్టు 31 వరకు రేషన్ ఈ-కేవైసీ గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించింది. రేషన్ కార్డులు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది. రేషన్‌కార్డు ఉన్నవారు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ-కేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రజలు దగ్గరలో ఉండే ఏ రేషన్ షాపులోనైనా వెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.. పూర్తిగా ఉచితం. ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అక్కడే ఈ-కేవైసీ చేయించుకోవలనే ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. వన్ నేషన్ – వన్ రేషన్ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి దగ్గరలో ఉండే రేషన్ షాపులోనైనా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

ఈ-కేవైసీపీ ప్రక్రియను వేలి ముద్ర, లేదా ముఖ గుర్తింపు ద్వారా కేవలం 10 సెకన్లలో పూర్తి చేస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వెంటనే రేషన్ డీలర్, సంబంధిత పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ నిలిపివేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ-కేవైసీ చేసుకోకపోతే సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. తెలంగాణలో శనివారం నుంచి మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. రేషన్ కార్డులో ఒక్కో సభ్యుడికి 6 కిలోల చొప్పున మూడు నెలలకు 18 కిలోలు చొప్పున రేషన్ పంపిణీ చేస్తారు. ఈ-కేవైసీ గడువు పొడిగించిన విషయాన్ని గమనించి.. పెండింగ్ ఉన్నవారు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...