వాట్సాప్‌లో సర్కార్ సేవ.. ఈ నెంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు.. అరచేతిలో ప్రభుత్వ సర్వీసులు!

Date:

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా అందించేందుకు వాట్సాప్‌ను ప్రధాన వేదికగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అనేక శాఖలకు చెందిన సేవలు ఒక్క మెసేజ్‌తోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ సేవలు రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ను ప్రధాన వేదికగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం WhatsApp ద్వారా ఇప్పటికే మీ సేవ సేవలు, టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరిన్ని శాఖల సేవలను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ప్రజలు 80969 58096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే చాలు.. వివిధ సేవలకు సంబంధించిన మెనూ ప్రత్యక్షమవుతుంది. అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకుని నేరుగా సేవలు పొందేలా సిస్టమ్ రూపొందించారు.

ఇప్పటి వరకు వివిధ శాఖలకు వేర్వేరు వెబ్‌సైట్లు, పోర్టల్స్ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ కొత్త విధానంతో అన్ని సేవలు ఒకే వేదికలో అందుబాటులోకి వచ్చాయి. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడం కూడా మరింత సులభమైంది. రిజిస్ట్రేషన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే క్షణాల్లో పీడీఎఫ్ రూపంలో హాల్ టికెట్ అందుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డుల హాల్ టికెట్లు, ఫలితాలు కూడా ఇదే వాట్సాప్ ద్వారా అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు.. నేరుగా సేవలు పొందే వేదికగా కూడా అభివృద్ధి చేశారు. కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాల స్థితి తెలుసుకోవడం నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రేషన్ కార్డు వివరాలు, పెన్షన్ స్టేటస్, ప్రభుత్వ పథకాల అర్హత వంటి విషయాలను కూడా ఇంటి నుంచే చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. నగదు బదిలీల సమాచారం కూడా మెసేజ్ రూపంలో అందుతుంది.

రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాల అప్లికేషన్లు కూడా ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా చేసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో ఇది ‘వన్ స్టాప్ షాప్’లా మారనుంది. మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రజలు నేరుగా ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఈ విధానం కల్పిస్తోంది. సమయం ఆదా కావడంతో పాటు అవినీతి అవకాశాలు కూడా తగ్గేలా సిస్టమ్ రూపొందించారు. డిజిటల్ అసిస్టెంట్ తరహాలో పనిచేసే ఈ వాట్సాప్ సేవ.. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...