విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థులకు హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణ సాయం అందించారు. ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

విశాఖపట్నం నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా పాయకరావుపేటకు వెళ్తున్న హోంమంత్రి అనిత మార్గమధ్యంలో ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. అనంతరం గాయపడిన విద్యార్థుల వద్దకు చేరుకుని వారికి తక్షణ సాయం అందించారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

అలాగే ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం డ్రైవర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన విద్యార్థులకు సహాయం అందించిన హోంమంత్రి అనిత చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *