నిరవధిక సమ్మె.. వాహన సంఘాల పిలుపు .. రేపట్నుంచి వాహన, డెలివరీ సేవలు బంద్‌

Date:

రేవంత్‌ సర్కార్‌పై డ్రైవర్లు, యాప్‌ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్‌, కనీస ఛార్జీలు, సామాజిక భద్రత అందిస్తామని మాటిచ్చి తమను మోసం చేసిందని వాహన సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సిటీబ్యూరో, ఆగస్టు 6 ( నమస్తే తెలంగాణ ) : రేవంత్‌ సర్కార్‌పై డ్రైవర్లు, యాప్‌ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్‌, కనీస ఛార్జీలు, సామాజిక భద్రత అందిస్తామని మాటిచ్చి తమను మోసం చేసిందని వాహన సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ నిరక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నుంచి వాహన సేవలతో పాటు అన్ని రకాల యాప్‌ ఆధారిత డెలివరీ సేవలు బంద్‌ ఉండనున్నాయి. సుమారు 4 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ నాయకులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు తమ గోడు వెల్లబోసుకున్నామని చెప్పారు.

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్‌టీయూ క్యాబ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నగేశ్‌ మాట్లాడుతూ.. యాప్‌ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం ప్లాట్‌ ఫారమ్‌ కంపెనీలు కలిసి కనీస బేస్‌ ఫేర్‌, అలాగే ప్రతి కిలోమీటరుకు మరియు ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను ప్రభుత్వం నోటిఫై చేసి యాప్‌ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వరర్లు మరియు అన్ని గిగ్‌, ప్లాట్‌ ఫారమ్‌ కార్మికులకు స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలన్నారు. తెలంగాణ గిగ్‌, ప్లాట్‌ ఫారమ్‌ వరర్స్‌ రూల్స్‌ ను వెంటనే నోటిఫై చేసి, గిగ్‌ మరియు ప్లాట్‌ ఫారమ్‌ వరర్స్‌ వెల్ఫేర్‌ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు- 2025ను పూర్తిగా అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన కనీస చార్జీలను నోటిఫై చేయాలని తెలిపారు. మోటార్‌ వెహికల్స్‌ చట్టం- 1988 మరియు మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు- 2025 ప్రకారం కమర్షియల్‌ రిజిస్ట్రేషన్‌ కు మార్చకుండా ప్రైవేట్‌ (నాన్‌-కమర్షియల్‌) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్‌ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇస్తానన్న ఏడాదికి రూ.12వేలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీపీడబ్ల్యూ సలావుద్దిన్‌, సీఐటీయూ అజయ్‌ బాబు, ఐఎల్‌డబ్ల్యూఎఫ్‌ ఇనాయత్‌ అలీబక్రీ, టీఆర్‌టీయూ ఎం.ఎ.సలీం, ఐఎన్‌టీయూసీఎఫ్‌. రామకృష్ణారెడ్డి, టీఎంసీడీఏ అబ్దుల్‌ రవూఫ్‌, బీఎంఎస్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...