స్వాతంత్ర్యం సాధించి 79 ఏళ్లు పూర్తిచేసుకున్న భారత్‌.. ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా అవతరించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోంది.

అభివృద్ధి, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, స్వావలంబనతో పాటు యువశక్తిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ద్వారా భారత్‌ను మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ముందుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా ‘యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047’ అనే స్ఫూర్తి ప్రధానంగా నిలిచింది.

భవిష్యత్ తరాల కోసం బలమైన, అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలి. ప్రపంచ వేదికపై భారత్‌ మరింత కీలక పాత్ర పోషించేలా ఐక్యతతో ముందుకు సాగుదాం.

By Ramya