రాజకీయాల్లోకి ఏవీ రంగనాథ్.. తెలంగాణ జనసేన ఇంఛార్జ్‌గా బాధ్యతలు..? క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్

Date:

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన పొలిటికల్ ఎంట్రీ ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. యూట్యూబ్ ఛానెల్ ‘రా టాక్స్ విత్ వీకే’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా సోషల్ మీడియా సృష్టియేనని, తన ఉద్యోగ బాధ్యతలను ప్రశాంతంగా చేసుకోనివ్వాలని కోరారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనుగోలు చేసిన కోడి చెరువు భూవివాదాన్ని ప్రస్తావిస్తూ.. పవన్ ఎలాంటి చెరువునూ ఆక్రమించలేదన్నారు. అయితే చెరువు పరిధిలో ఫెన్సింగ్ వేయడం మాత్రమే నిబంధనలకు విరుద్ధమని వివరించారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉద్యోగానికి రిజైన్ చేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఉందని.. కోడి చెరువు ఇష్యూలో పవన్‌ను రంగనాథ్ కాపాడారంటూ కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీ, పవన్ కల్యాణ్ కోడి చెరువు ఇష్యూపై రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. ‘రా టాక్స్ విత్ వీకే’ అనే యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.

‘పవన్ కల్యాణ్ గారి కోడిచెరువు ఇష్యూ ఉంది. దీనిపై సోషల్ మీడియా రకరకాలుగా ప్రచారాలు చేసింది. చిరంజీవి గారు, ఆయన ఫ్యామిలీతో నాకు గత 20 ఏళ్లుగా పరిచయం ఉంది. వాళ్లు బాగా తెలుసు. కల్యాణ్ గారితో కూడా సాన్నిహిత్యం ఉంది. నేను జనసేన నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అవుతాననే ప్రచారం ఉంది. జనసేన తెలంగాణలో లేదు కదా.. ఏపీలో కదా ఉంది. నేను తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ అవుతా అని అంటున్నారు. సోషల్ మీడియానే ఇదంతా చేసింది. నా ఉద్యోగం నన్ను ప్రశాంతంగా చేసుకోనివ్వండి. ఎవరికి వాళ్లు నాకు పార్టీలను అంటగట్టి సీట్లు కూడా ఫిక్స్ చేశారు. నా ఉద్యోగం నాకు రెస్పాన్సిబిలిటీ. నేను పాలిటిక్స్ అనే థింకింగ్‌లోనే ఉండను.

ఇక పవన్ కల్యాణ్ భూ వివాదం చూసినట్లయితే.. 2014లో పవన్ ఓ నలుగురు రైతుల నుంచి పట్టా భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2026లో చెరువు అని నోటిఫై చేశారు. 2023లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. పవన్ మాత్రం ఆ భూమిని ముందే కొన్నారు. అయినా అది పట్టా ల్యాండ్. పవన్ కల్యాణ్ ఎక్కడా చెరువు ఆక్రమించలేదు. చెరువు ముఖచిత్రాన్ని మార్చలేదు. కాకపోతే ఆయన చేసిన తప్పల్లా.. చెరువుకు ఫెన్సింగ్ వేశారు. అలా ఫెన్సింగ్ వేయకూడదు. దీనిపై హైడ్రా అభ్యంతరం తెలిపింది. చెరువులో పట్టా భూములు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. చెరువుల్లో ఉండే భూములు మూడు రకాలు. ఒకటి శిఖం సర్కారీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని రిజిస్ట్రేషన్ చేయరు. రెండోది శిఖం పట్టా దీని ద్వారా చెరువులో నీళ్లు లేనపుడు పంటలు పండించుకోవచ్చు. మూడోది రెగ్యూలర్ పట్టా. ఇది ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు.’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...