• మునుపటి ప్రభుత్వ హయాంలో మూసివేసిన వీఆర్సీ ఆధునికీకరణతో విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ తెలిపారు. అదే స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌ను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. గురువారం ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌లో నిర్వహించిన టీచర్లు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యుల ఆత్మీయ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూలాపేటలోని డీఎస్‌ఆర్ స్కూల్‌ను దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి రాజకోట తరహాలో అభివృద్ధి చేశారని తెలిపారు. దాతల సహకారంతో నగరంలోని మరో 15 ప్రభుత్వ హైస్కూళ్లను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న మంత్రి నారాయణ. తాను గుడిసెలో పుట్టి, ఎన్నో కష్టాల మధ్య పెరిగానని తెలిపారు.
  • చదువుకునే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. హరనాథపురం నుంచి వీఆర్సీ వరకు కాలినడకన వెళ్లి చదువుకున్న రోజులు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని పేర్కొన్నారు. తన తండ్రి ప్రైవేట్ బస్ కండక్టర్‌గా పనిచేసి సంపాదించిన ఆదాయంతోనే కుటుంబం నడిచేదని మంత్రి తెలిపారు.
  • బాగా చదువుకుని పేదరికాన్ని అధిగమించాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నానన్నారు. విద్య జీవితాన్ని మార్చే శాశ్వత ఆస్తి అని పేర్కొంటూ, పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని మంత్రి నారాయణ వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసే బాధ్యతను వీపీఆర్ ఫౌండేషన్‌కు అప్పగించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.
  • మంత్రి నారాయణ ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా పాఠశాలను తీర్చిదిద్దామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నారాయణ విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న మంత్రి నారాయణను ఆమె అభినందించారు. నారాయణ వంటి వ్యక్తి నెల్లూరులో ఉండటం జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
  • వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో వీపీఆర్ విద్య కార్యక్రమాన్ని కార్పొరేట్ స్థాయిలో ప్రారంభించామని ప్రశాంతి రెడ్డి తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *